హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మానాన్నలకు దూరమైన చిన్నారి క్షేమం

విశాఖలో అమ్మానాన్నలకు దూరమైన ఐదేళ్ల బాలుడు షేక్ అమాన్ క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. కనకమహాలక్ష్మి ఆలయం మార్గంలో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని స్థానిక యువకులు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. సరిగా మాట్లాడలేని ఆ బాలుడు కోటవీధికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. తాతను పిలిచి సురక్షితంగా అప్పగించారు.