హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీలో రూ .41.53 లక్షలతో కొత్త జేసీబీ

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కోసం రూ.41.53 లక్షలతో కొత్త జేసీబీని కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ కృషితో ఏపీ జెన్‌కో సంస్థ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ యంత్రాన్ని సమకూర్చింది. గురువారం మున్సిపల్ కమిషనర్ రవికి జేసీబీని అందజేశారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో చెత్త కుప్పలు, భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు దీనిని వినియోగించనున్నారు.