హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ మహా‌చండీ దేవి అలంకరణలో శ్రీ కనక దుర్గమ్మ

W.G: ఉండి కొత్తపేటలో శ్రీ కనక దుర్గమ్మ ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం అమ్మవారిని శ్రీమహా చండీదేవి అమ్మవారిగా ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులచే ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. ప్రత్యేక పూజలో డాక్టర్ బాల శ్రీను, D. శ్రీనివాసు, శ్రీలక్ష్మి, P. రామస్వామి తదితరులు పాల్గొన్నారు.