హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని నిరసన

MNCL: కేంద్ర ప్రభుత్వం జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం నస్పూర్‌లోని సీసీసీ కార్నర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ కులగణనకు అనుకూలంగా 10 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.