హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ మాగుంటకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం తన పార్టీ కార్యాలయంలో అటహాసంగా జరిగాయి. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ఉగ్ర నరసింహారెడ్డిలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మాజీ మేయర్ గంగాడ సుజాత, పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.