హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత్, మోదీ చేస్తున్న కృషి అద్భుతం’

ఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారతదేశం, ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(AI) రంగంలో భారత్, ప్రధాని మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. భారత్ గ్లోబల్ AI సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిందని, తొలి 10 దేశాలతో కూడిన 'ప్యాక్స్ సిలికా'లో చోటు దక్కించుకుందని తెలిపారు.