హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల పోలింగ్ తేదీ మార్చాలని ఈసీకి లేఖ

విజయనగరం కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నెల 27న పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం జరగనున్నందున, ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను 29కి మార్చాలని వారు కోరారు. ఉత్సవం, ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా తేదీ మార్చాలని అధికారులు ఈసీకి విజ్ఞప్తి చేశారు.