హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి మాజీ మండల అధ్యక్షుడు పునరాగమనం

KKD: కిర్లంపూడికి చెందిన అడపా పార్థసారథి తిరిగి వైసీపీలో చేరారు. ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో వైసీపీ మండల అధ్యక్షుడిగా పనిచేసిన పార్థసారథి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఏలేశ్వరం మండలంతో పాటు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని పేర్కొన్నారు.