హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలకడ, రాయచోటిలో భారీ వర్షం

అన్నమయ్య జిల్లా కలకడ, రాయచోటిలో గురువారం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులపై నీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. మరోవైపు, వర్షం ఇలాగే కొనసాగితే జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.