హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మంత్రి ఫరూక్‌తో ఏవీ సుబ్బారెడ్డి భేటీ'

నంద్యాలలో మంత్రి NMD ఫరూక్‌ను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు,నియోజకవర్గ రాజకీయ అంశాలపై చర్చించారు. పార్టీ శ్రేణుల సమన్వయం,అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై మాట్లాడారు.ఈ భేటీలో కొప్పుల శివ నాగిరెడ్డి ఉన్నారు.