ASR: ధారకొండ హనుమాన్ జంక్షన్లో ఇవాళ సీలేరు ఎస్సై యాసిన్ ఈగల్ టీమ్తో కలిసి ఆపరేషన్ త్రిశూల్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అప్రమత్తంగా ఉండాలని, వాటి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలిపాలన్నారు. ప్రజలు, యువత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధారకొండలో ఆపరేషన్ త్రిశూల్పై అవగాహన


