HYD: పాతబస్తీ పరిధిలోని కాంచన్బాగ్ పీఎస్ పరిధిలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాబా నగర్ ఫంక్షన్ హాల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన మహీంద్రా కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు గాల్లోకి లేచి రోడ్డుపై పల్టీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
VIDEO: డివైడర్ను ఢీకొట్టిన కారు


