MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో కొలువు దీరిన దుర్గామాత అమ్మవారికి మహిళలు బోనాలను నైవేద్యంగా సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కావడంతో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గురువారం మహిళలు ఇళ్ల వద్ద బోనాలను తయారు చేసి భారీ ఊరేగింపు మధ్య మండపానికి చేరుకొని బోనాన్ని సమర్పించారు.
వార్తలు
దుర్గామాతకు బోనాన్ని నైవేద్యంగా సమర్పించిన మహిళలు


