హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నిరసనపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు విచారణ

కన్నాట్ ప్రాంతంలో(ఢిల్లీ) కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తలపెట్టిన నిరసనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ నిరసనను వెంటనే ఆపాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందించిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే.. సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు రావాలని కోరారు.