హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు బంద్..!

కోనసీమ: మలికిపురం మండలం పరిధిలోని దిండి-చించినాడ వశిష్ట గోదావరి వంతెనకు మరమ్మత్తుల కారణంగా 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.