హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసు.. భయంతో నిందితుడు ఆత్మహత్య

RR: పోక్సో కేసు నమోదుతో అరెస్ట్ చేస్తారన్న భయంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేటలో చేటుచేసుకుంది. అల్మాస్ గూడకు చెందిన హర్షవర్ధన్ రెడ్డిపై ఈనెల 12న మీర్‌పేట్ PSలో పోక్సో కేసు నమోదు అయింది. మైనర్ బాలిక స్నానం చేస్తుండగా ఫోన్‌లో వీడియో తీసినట్లు ఆరోపణ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.