హైదరాబాద్: 28°C
వార్తలు

మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు

ఇస్లాంలోకి మతం మారిన వ్యక్తులకు బీసీ రిజర్వేషన్ల అర్హత లేదని స్పష్టం చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ సామాజిక వర్గం నుంచి అన్య మతంలోకి మారినవారు రిజర్వేషన్ లబ్దిని కోరలేరని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఏడు బీసీ ముస్లిం వర్గాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.