JGL: జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి ఎల్లమ్మ గుడి కల్యాణ మండపం, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గీత కార్మికులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ను కోరారు. ఈ మేరకు గురువారం సోమన్పల్లి, సంఘంపల్లి గీత పారిశ్రామిక సంఘం సభ్యులు ఆయనను నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఎల్లమ్మ ఆలయాభివృద్ధికి ఎమ్మెల్యేకు వినతి


