హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తికి ఎర్ర తెగులు.. ఆందోళనలో రైతులు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పత్తి పంటకు ఎర్ర తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, తెగులు నివారణకు సూచనలు అందించడంతో పాటు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.