హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాళ్లపేటలో బస్సు షెల్టర్‌ ఏర్పాటు చేయాలి'

MNCL: దండేపల్లి మండలం తాళ్లపేటలో బస్సు షెల్టర్‌ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ గ్రామం మీదుగా మంచిర్యాల నుంచి బస్సులు రాకపోకలు సాగిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు. బస్సుల కోసం ఎండలోనే వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి షెల్టర్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.