హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

కోనసీమ: కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు పంచాయతీ పరిధిలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.