హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

MBNR: భూత్పూర్ పట్టణంలోని పదవ వార్డులోని రేషన్ షాపు వద్ద లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు లిక్కి నవీన్ గౌడ్ స్మార్ట్ రేషన్ కార్డులను ఇవాళ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందడంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.