హైదరాబాద్: 28°C
వార్తలు

ఐక్యరాజ్యసమితి తీరుపై భారత్ ఆగ్రహం

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎప్పుడు నివేదిక ఇస్తారని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ను(OHCHR) భారత్ నిలదీసింది. PoKలో పాక్ బలగాల హత్యలు, ఇంటర్నెట్ ఆంక్షలపై దర్యాప్తు ఏమైందని భారత ప్రతినిధి అనూజ్ స్వరూప్ ప్రశ్నించారు. నిరసనలపై కమిషన్ చూపుతున్న పక్షపాత ధోరణి, ద్వంద్వ ప్రమాణాలు అంతర్జాతీయ సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.