హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా బషీరాబాద్ జడ్పీ స్కూల్

VKB: బషీరాబాద్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS)గా తీర్చిదిద్దేందుకు రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఈ నిధులు కేటాయించారు. దీని ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆధునిక వసతులు, తరగతి గదులతో కూడిన నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుబాటులోకి రానుంది.