SDPT: బెజ్జంకి బస్టాండ్లో శివ సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపంలో ఐదో రోజు అమ్మవారు లలితాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు భక్తితో కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తూ పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళలచే కుంకుమ పూజ


