అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం జార్రావారిపల్లి, వడ్డిపల్లి గ్రామాల్లో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్.. 15 బైక్లు స్వాధీనం


