హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డుల విభజనపై 42 అభ్యంతరాలు

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డులను 72గా పునర్విభజించడంపై 42 అభ్యంతరాలు అందాయని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని పేర్కొన్నారు. ఈ నెల 16న తుది నోటిఫికేషన్ గెజిట్లో ప్రచురించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.