హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్థివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి

NRPT: మక్తల్ మండల కేంద్రంలోని ఎల్లమ్మకుంటలో మృతి చెందిన నాగప్ప పార్థివదేహానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.