శ్రీకాకుళం పట్టణంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జ్యోతీరావు పార్క్లోని కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో గద్ది బోయిన కృష్ణారావు, గుత్తి చిన్నారావు తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
అబ్దుల్ కలాం జయంతి వేడుకలు


