హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిరుపయోగంగా మహిళా సాధికారిక భవనం

కృష్ణా: మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో రూ.8.50 లక్షలతో నిర్మించిన మహిళా సాధికారిక భవనం ప్రయోజనం లేక నిరుపయోగంగా మారింది. 2018లో అట్టహాసంగా ప్రారంభించిన ఈ భవనానికి వేసిన తాళం వేసినట్లే ఉండటంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలకు నిలయంగా మారింది. అధికారులు మహిళల కోసం నిర్మించిన ఈ భవనాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.