BHNG: రాజాపేట మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రఘునాథపురం గ్రామానికి చెందిన తోకట్ల మధుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తఖీయుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత


