హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐల బదిలీలపై ఉత్కంఠ?

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో SIల బదిలీలు పూర్తవడంతో ఇప్పుడు CIల పోస్టింగ్లపై చర్చ మొదలైంది. దసరా తర్వాత పలువురు సీఐలకు స్థానచలనం ఉండవచ్చన్న ప్రచారం సాగుతోంది. కేయూసీ, సుబేదారి, హనుమకొండ వంటి కీలక పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ల కోసం కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పొరుగు జిల్లాల నుంచి కూడా పలువురు కమిషనరేట్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.