పసిడి ప్రియులకు ఊరటనిస్తూ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,47,440కి చేరింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడిపై రూ.750 తగ్గి రూ.1,35,150గా నమోదైంది. మరోవైపు కిలో వెండిపై ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
వ్యాపారం
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


