హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

VSP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఇవాళ అత్యంత భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పవిత్రమైన తులసి దళాలతో ప్రత్యేకంగా తులసి దళార్చన జరిపించారు.​అమ్మవారిని సుగంధ భరితమైన తులసి దళాలతో అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయని, భక్తుల కోర్కెలు నెరవేరుతాయని అర్చకులు తెలిపారు.