హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు గురువారం అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5.30 నుంచి లక్ష్మీగణపతి పూజ, ఏకాదశ రుద్రాభిషేకం, చతుష్షష్ట్యోపచార పూజలు, జపాలు, హోమాలు, కన్యాకా సువాసినీ పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ నిర్వహించారు.