హైదరాబాద్: 28°C
వార్తలు

తొలిసారి కాంగ్రెస్‌తో కలిసి విజయ్ పార్టీ ఆందోళన

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి ఇవాళ చెన్నైలో నిరసన చేపట్టనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఈసీ తీరును నిరసిస్తూ ఎగ్మోర్‌లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఆందోళనకు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ నేతృత్వం వహిస్తారు. కూటమిలో చేరిన విజయ్ పార్టీ(TVK) తొలిసారిగా కాంగ్రెస్, ఇతర విపక్షాలతో కలిసి ఈ నిరసనలో పాల్గొనబోతుండటం విశేషం.