RR: చేవెళ్ల మండలంలో ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఆర్డీవో పార్థ సింహారెడ్డి తెలిపారు. గతంలో ఓటరు జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం కనిపించని లేదా తొలిగించి ఉంటే.. వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నమోదు కావాలనుకునే అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు, రేపు ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు


