హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుబ్బాకలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడ్‌ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్‌ ఎండీ రఫీ (32) మృతి చెందాడు. రామక్కపేట మార్గంలో రహదారి పక్కన బైక్‌ ఆపి నిలబడిన రఫీని వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.