హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 84,289 మంది భక్తులు దర్శించుకోగా.. 31,474 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.