ADB: ఇచ్చోడ మండలంలోని దుబారపేటకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో బుధవారం చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీలకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే బాబురావు సమక్షంలో TRSలో చేరికలు


