ELR: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS) పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును నవంబర్ 29 వ తేదీ వరకు పొడిగించారని ఏలూరు జిల్లా డీఈవో వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదివే వారు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
NMMS దరఖాస్తు గడువు పెంపు


