ADB: ఇచ్చోడ మండలం చించోలి గ్రామ వాగులో వైద్య వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా పడేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో వెలువడే వైద్య వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాల్సి ఉన్నా, ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
చించోలి వాగులో వైద్య వ్యర్థాల పారవేత


