NRML: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, ఎండల తీవ్రత పెరగడంతో గోదావరిలో నీటిమట్టం పడిపోయి నది వెలవెలబోతోంది. రాళ్లు బయటపడటంతో నది కళావిహీనంగా కనిపిస్తోంది. ఖానాపూర్ శివారులో వినాయక నిమజ్జనం చేసిన ప్రాంతంలో నీరు తగ్గడంతో విగ్రహాలు ఇంకా కరగకుండా అలాగే కనిపిస్తున్నాయి. గోదావరి జలాలపై ఆధారపడి తీర ప్రాంత రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
తెలంగాణ
ఖానాపూర్ వద్ద గోదావరిలో తగ్గిన నీటిమట్టం


