హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

MDK: రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి కరెంట్ షాక్‌తో రైతు నర్మల సిద్ధరాములు మృతి చెందారు. పొలం వద్ద తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారం వ్యవధిలోనే ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మరణించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.