హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుస్సాడి వేడుకలకు రూ.1.5 కోట్లు

ADB: దీపావళి గుస్సాడి (దండారి) ఉత్సవాలకు ప్రభుత్వం రూ.1.5 కోట్లు విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీ గూడేలకు ఇవి అందుతాయి. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు విజ్ఞప్తితో మంజూరవగా, ఆదివాసీ సర్పంచులు వారిని సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. బృందాల వారీ కేటాయింపు ఇంకా తేలలేదు.