హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట మునుగుతున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి

PDPL: పెద్దపల్లి మండలం కొత్తపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద చిన్నపాటి వర్షానికే వరద నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. బ్రిడ్జి కింది భాగంలో ఉండటంతో పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలు, ఓదెల మండలానికి రవాణా నిలిచిపోతోంది. పనులు ఇష్టారీతిన చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.