హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొటానికల్ గార్డెన్‌లో బంగారు చిమ్మట దర్శనం

MBNR: జడ్చర్ల‌లో డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్ గార్డెన్‌లో బుధవారం అంథెరేయియా ఫాపియా చిమ్మట కనిపించింది. బంగారు రెక్కలు, నేత్రాకార మచ్చలతో ఈ పెద్ద చిమ్మట ఆకట్టుకుంది. శాటర్నిడే కుటుంబానికి చెందిన ఈ జాతి టస్సార్ పట్టు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. తెల్లమద్ది, నల్లమద్ది, రేగు, నారేపి మొక్కలపై ఆధారపడి జీవిస్తుందని సదాశివయ్య తెలిపారు.