హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థకు చేరిన ఆరోగ్య ఉపకేంద్రం

JGL: గొల్లపల్లి మండలంలో ఎనిమిది ఆరోగ్య ఉపకేంద్రాలుండగా, చిల్వాకోడూరులోని కేంద్రం మాత్రమే సొంత భవనంలో కొనసాగుతోంది. మిగతావి అరకొర వసతులతో అద్దె భవనాల్లో సేవలందిస్తున్నాయి. మల్లన్నపేట, ఇబ్రహీంనగర్‌లో ఉపకేంద్రాల నిర్మాణాలు చివరి దశలో నిలిచిపోయాయి. చిల్వాకోడూరు కేంద్రం శిథిలావస్థకు చేరి, పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో సిబ్బంది, రోగులకు ఇబ్బందులు ఎదురువతున్నాయి.