WGL: వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు గురువారం అమ్మవారు లలితా మహా త్రిపురసుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
లలితా మహా త్రిపురసుందరిగా అమ్మవారి దర్శనం


