హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్‌లో బతుకమ్మ ఆడిన కలెక్టర్

WGL: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద తన కుమార్తె శ్రీహాన్షితో కలిసి వేడుకల్లో పాల్గొని, సహోద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడంతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. ప్రకృతిని కాపాడుతూ.. పండుగ సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.